Happy New year 2021 - 2021నూతన సంవత్సర శుభాకాంక్షలు - नव वर्ष 2021 की हार्दिक शुभ कामनाएँ..
2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు గౌరవనీయులైన పెద్దలకు, ప్రియ మితృలకు, ప్రియాతి ప్రియమైన చిన్నారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనందరి జీవితాలలో ఈ నూతన సంవత్సరం చాలా విశిష్టమైంది. ఎందుకంటే 2020 అనే ఒక ఆతి విలక్షణ సంవత్నరంలో ఏ యుగంలోను ఎవరు చూడని కరోనా అనే మహామారిని చూసాం. కనిపించని ఆ మహామారితో దైర్యంగా పోరాడి, దాని నుండి బయట పడినందుకు మనందరం మనల్ని మనం అభినందించుకోవాలి. మనందరి సమైక్య పోరాటం వలననే మనం ఈ రాకాసి వ్యాది నుండి బయట పడకలిగాం. అయినా మనం దానిని పూర్తిగా అంతం చేయలేక పోయాం . ఈ సంవత్సరం మన ప్రధమ లక్ష్యం కరోనాను అంతం చేయడమే కావాలి. ఇంతకు ముందు లాగానే మనం దానిని నిరోదించటానికి, రూపుమాపటానికి తగిన జాగ్తత్తలు తీసుకుంటూ ఉండాలి. మన ఎదుట బలమైన శత్రువు ఉన్నప్పుడే మనం మన బలహీనతలనుండి బయట పడటానిని తగిన ప్రయత్నం చేసి, బలంగా ఎదగటానికి ప్రయత్నం చే...